Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (11:09 IST)
రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు మంగళవారం నిర్వహించుకోవాలని రివాయత్ హలాల్ కమిటీ సూచించింది. సోమవారం నెలవంక కనువిందు చేయడంతో మంగళవారం రంజాన్ పర్వదినం అంటూ రివాయత్ హలాల్ కమిటీ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రేపు ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సెలవు ప్రకటించాయి.
 
కాగా, రాష్ట్రంలోని ముస్లింలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ పర్వదినం) శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోనూ వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందులతో మతసామరస్యం వెల్లివిరుస్తుందని, ఇలాంటి శుభ సందర్భాల్లో అన్ని వర్గాలు పరస్పరం స్నేహ భావంతో ఉండాలని కేసీఆర్ సూచించారు. అలాగే, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
 
అలాగే, హైదరాబాదు చిలకలగూడ ఈద్గాలో ఏర్పాటుచేసిన రంజాన్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మరోవైపు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments