పాత్రికేయుల వృత్తి నైపుణ్యం పెంపునకు కృషి: ఏపీ ప్రెస్ అకాడమి ఛైర్మన్

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (19:01 IST)
ఏపీ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రెస్ అకాడమీ వివిధ విశ్వవిద్యాలయాలతో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు అకాడమి చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. వివిధ విశ్వవిద్యాలయాల్లోని జర్నలిజం శాఖలో అడ్మిషన్ తీసుకున్న జర్నలిస్టులకు ఫీజు రాయితీ కల్పించాలని భావిస్తున్నాయని తెలిపారు.

అందులో భాగంగా నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో బుధ‌వారం ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలతో సంప్రదింపులు జరిపి జర్నలిస్టుల, అడ్మిషన్లు, ఫీజురాయితీల గురించి ఒప్పందాలు చేసుకునేందుకు కోఆర్డినేషన్ అధికారిగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ కృష్ణా రెడ్డిని నియమించామని తెలిపారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, విశ్వవిద్యాలయాల్లో ఆ మేరకు సిలబస్ లో మార్పులు చేయాలని కోరారు. జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించే ఏర్పాట్లు కూడా చేస్తామని తెలిపారు. వివిధ విశ్వవిద్యాలయాల సమన్వయంతో సదస్సులు, వర్కుషాపులు నిర్వహించేందుకు కూడా సమాయత్తమవుతున్నామని వివరించారు.

ప్రభుత్వ పథకాలు, వివిధ కార్యక్రమాల్ని ఆయా వర్గాలకు చేర్చడానికి యూనివర్సిటీలతో కలిసి పని చేయాలని భావిస్తున్నామని వివరించారు. వి.ఎస్.యుతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాల్లో ఆ యూనివర్సిటీ రిజిస్ట్రారు విజయకృష్ణా రెడ్డి, ప్రెస్ అకాడమి కార్యదర్శి ఎం.బాలగంగాధర్ తిలక్ సంతకాలు చేసి చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సమక్షంలో పరస్పర ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments