Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రిపై నేడు దుర్గాదేవిగా దుర్గమ్మ దర్శనం

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (08:38 IST)
దసరా  శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 7వ రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ అష్ట‌మి సంద‌ర్భంగా బుధవారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీదుర్గాదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. అష్ట‌మి నాడు దుర్గాదేవిగా భ‌క్తుల‌ను సాక్షాత్కారిస్తుంది జ‌గ‌దంబ‌.

దుర్గ‌ముడ‌నే రాక్ష‌సుడిని సంహ‌రించినందున దుర్గ అని పేరొచ్చింది. దుర్గ‌తుల‌ను నివారించే మ‌హాశ‌క్తి స్వ‌రూపంగా భ‌క్తులు దుర్గాదేవిని కొలుస్తారు. ఎరుపు రంగు చీర‌లో త్రిశూలం చేత‌ప‌ట్టి కోటి సూర్య‌ప్ర‌భ‌ల‌తో వెలుగొందే ఈ అమ్మ‌వారిని ఎర్ర‌టి పుష్పాల‌తో పూజిస్తే శ‌త్రు బాధ‌లు న‌శిస్తాయి.

ఈ రోజున అమ్మ‌వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన గారెలు, క‌దంబం (కూర‌గాయ‌లు, అన్నం క‌లిపి వండేది) బెల్లం, పాయ‌సం నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు. ఈ రోజున భ‌క్తులు దుర్గాష్ట‌మిగా కూడా జ‌రుపుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments