Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్... 9,061 పోస్టులు... మంత్రి గంటా వెల్లడి

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (18:21 IST)
ఏపీ డీఎస్సీ 2014 నోటిఫికేషన్‌ను జారీ చేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 9061 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో 1949 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు, 812 భాషా పండితులు, 156 పీఈటీ, 6244 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు డిసెంబర్ 3 నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 9, 10, 11 తేదీల్లో ఉపాధ్యాయ నియామక పరీక్షలు జరుగుతని చెప్పారు. జూన్ 28న ఉపాధ్యాయ నియామక రాత పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 
 
మరోవైపు.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా విడుదల చేసిన డీఎస్సీ-2014 నోటీఫికేషన్ షెడ్యూల్ అస్పష్టంగా ఉందని పలువురి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డీఎస్సీతో పాటు టెట్ పరీక్షను కూడా ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. 
 
తాజా డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్‌తో గతంలో టెట్ అర్హులైన వారు కూడా మరోసారి పరీక్ష రాయాల్సి ఉండటంతో గందరగోళానికి తావిస్తోంది. అయితే టెట్ పరీక్షల్లో వెయిటేజీ ఆధారంగానే డీఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments