Webdunia - Bharat's app for daily news and videos

Install App

ష(న)న్నే ష(డ)బ్బులడుగాతావ్ రా... పూటుగా తాగి ఆటోవాలాపై దాడికి దిగిన హైదరాబాదీ యువతి

మోడ్రెన్ అమ్మాయిలం అంటూ కొందరు అమ్మాయిలు తెలంగాణ రాజధాని హైదరాబాదులో నానా రచ్చ చేస్తున్నారు. వీరు పబ్బుల్లో, పార్టీల్లో హాజరయ్యాక అలా పచ్చటి లాన్లోకి వచ్చేసి సిగరెట్ తీసి దమ్ము కొడుతూ సరదాగా మాట్లాడుతున్నారు. మరికొందరైతే రాత్రివేళ పూటుగా మద్యం సేవించ

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (21:55 IST)
మోడ్రెన్ అమ్మాయిలం అంటూ కొందరు అమ్మాయిలు తెలంగాణ రాజధాని హైదరాబాదులో నానా రచ్చ చేస్తున్నారు. వీరు పబ్బుల్లో, పార్టీల్లో హాజరయ్యాక అలా పచ్చటి లాన్లోకి వచ్చేసి సిగరెట్ తీసి దమ్ము కొడుతూ సరదాగా మాట్లాడుతున్నారు. మరికొందరైతే రాత్రివేళ పూటుగా మద్యం సేవించి రోడ్లపై నానా రచ్చ చేస్తున్నారు. సోమవారం అర్థరాత్రి హైదరాబాదులో ఓ అమ్మాయి పీకలదాకా తాగి ఫిలిం నగర్ నుంచి కృష్ణా నగర్ వరకూ ఆటోలో వచ్చింది. 
 
ఆటో ఆపి తూలుకుంటూ వెళ్లిపోతుంటే, ఆటోవాలా డబ్బులడిగాడు. ఇంకేముందు... ష(న)న్నే ష(డ)బ్బులడుగాతావ్ రా అంటూ అతడిపై దాడి చేయబోయింది. దీంతో అతడు బెదిరిపోయి రోడ్డు పక్కకు పరుగుపెట్టాడు. ఇంతలో అక్కడ స్థానికులు గుమిగూడారు. అతడిపైకి వెళుతుంటే అడ్డుకున్నారు. వారు అడ్డు రావడంపై మండిపడిన సదరు యువతి వారిని కూడా బూతులు తిట్టడం మొదలుపెట్టింది. ఇంతలో ఆటో డ్రైవర్ తిన్నగా వెళ్లి బంజారా హిల్స్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె గతంలో కూడా ఇలాగే తాగి నానా హంగామా చేసినట్లు పోలీసులు చెప్పడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?

అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే !

అలనాటి నటి దేవిక చంపడానికి ట్రైచేసిందన్న భర్త దేవదాస్

కెరీర్ పరంగా గ్యాప్ రాలేదు... లాక్డౌన్ వల్లే ఆ గ్యాప్ : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments