Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలబ్రిటీలకు డ్రగ్స్ "మత్తు"... సామాన్యులకు మద్యం "మత్తు"... దోషులెవరు?

గత 10 రోజులుగా హాట్ టాపిక్‌గా నడుస్తున్న డ్రగ్స్ దందాలో కొంతమంది సినిమా సెలబ్రిటీలను రోజూ విచారణ పేరుతో గంటల కొద్దీ ప్రశ్నలు సంధిస్తున్నారు. వారు ఎలా సమాధానాలు చెప్తున్నారోగానీ, దాని నుండి ఒక సామాన్యుడు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు. అందులో మొదటిది

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (12:43 IST)
గత 10 రోజులుగా హాట్ టాపిక్‌గా నడుస్తున్న డ్రగ్స్ దందాలో కొంతమంది సినిమా సెలబ్రిటీలను రోజూ విచారణ పేరుతో గంటల కొద్దీ ప్రశ్నలు సంధిస్తున్నారు. వారు ఎలా సమాధానాలు చెప్తున్నారోగానీ, దాని నుండి ఒక సామాన్యుడు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు. అందులో మొదటిది:
 
1) డ్రగ్స్ విచ్చలవిడిగా దేశంలోకి తీసుకొస్తున్నపుడు, పోలీసు వ్యవస్థ ఏమైనా నిద్రపోతున్నదా? లేక ఆమ్యామ్యాలకు అలవాటుపడి, ఇన్నాళ్లూ వాటిని విడిచిపెట్టి ఇప్పుడు ఏదో కొత్తగా మేము కనుగొన్నామని గొప్పలు చెప్పుకుంటున్నదా?
 
2) వారు విచారణకు ఆదేశించిన సెలబ్రిటీలు ఎన్నోసార్లు డ్రంక్&డ్రైవ్‌లో పట్టుపడినవారు ఉన్నారు, అప్పుడు వారు మద్యం మాత్రమే సేవించారా? లేక డ్రగ్స్ తీసుకొని ఉన్నారా? అప్పుడు ఎందుకు అవి బయటకు రాలేదు?
 
3) ఎంతోమంది ప్రముఖుల పిల్లలు రోడ్డు యాక్సిడెంట్‌లలో పోయారు. అప్పుడు వారు మద్యం మత్తులో మాత్రమే ఉన్నారా? లేక డ్రగ్స్ సేవించి ఉన్నారా? అవి కూడా బయటకు రాలేదు. 
 
ఇలా వారి కర్తవ్యాలను అప్పుడు మరచి, ఇప్పుడు తామేదో కొత్తగా ఏదో చేస్తున్నామని భ్రమను కలిగిస్తున్నారు. ఇక సామాన్యులు మద్యానికి అలవాటుపడి తమ జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు. విచిత్రమేంటంటే ఈ మద్యాన్ని ప్రభుత్వమే విచ్చలవిడిగా టెండర్లు పిలిచి, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ వ్యవస్థగా పెంచి పోషిస్తోంది. ఇప్పుడు మీరు కూడా అందులో పాత్రధారులే కదా.. ఇక మిమ్మల్ని ఇంటరాగేట్ చేయాలంటే ఇక ఆ దేవుడే దిగిరావాలేమో అంటూ సామాన్యుడు పెదవి విరుస్తున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments