Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్ర‌గ్స్ కేసు రివ‌ర్స్... పెద్ద‌ల మెడ‌కు లీగ‌ల్ నోటీసులు!

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (08:43 IST)
ఏపీలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై చిలువ‌లు ప‌ల‌వ‌లు చేసిన మీడియాకు లీగ‌ల్ నోటీసులు వెళ్ళాయి... ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు, నారాలోకేష్ స‌హా రాజ‌కీయ నేత‌లంద‌రికీ తాకీదులు జారీ అయ్యాయి. ఈ విష‌యంలో ఏపీ డీజీపీ మొద‌టి నుంచి చెపుతూనే ఉన్నారు. ఏపీకి డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంతో ఎటువంటి సంబంధం లేద‌ని, అయినా ప్ర‌తిప‌క్షాలు తీవ్ర ఆరోణ‌లు చేస్తూనే ఉన్నాయి. మీడియా వాటిని రాస్తూనే ఉంది. అందుకే ఏపీ డీజీపీ వారంద‌రికీ ఒక ఝ‌ల‌క్ ఇచ్చారు. మీరు చేసిన ఆరోప‌ణ‌లు, రాసిన రాత‌ల‌కు ఆధారాలు చూప‌మ‌ని. అంతే అంద‌రిక నోట్లో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిపోయింది. ఆఘ్ఘ‌నిస్తాన్ నుంచి ఢిల్లీకి మాద‌క‌ద్ర‌వ్యాలు వ‌యా విజ‌య‌వాడ అంటూ చేసిన క‌థ‌నాల‌కు ఇపుడు మూల్యం చెల్లించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.
 
డ్రగ్స్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేసినందుకు పలువురు రాజకీయ నాయకులకు, పత్రికా ప్రతినిధులకు పోలీసులు లీగల్ నోటీసులు జారీ చేశారు. ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, కింజరపు రామ్మోహన్ నాయుడు, బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, పట్టాభిరామ్, ఈనాడు అధినేత చెరుకూరి రామోజీ రావు, ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ త‌దిత‌రుల‌కు పోలీసుల తరపున లీగల్ నోటీసుల‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పంపారు. ఇక ప్ర‌తిప‌క్షాలు దీనిపై న్యాయ‌ప‌ర‌మైన పోరాటం చేయ‌డం త‌ప్ప వేరే దారి లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments