Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాతలు కూడా సామాజిక దూరాన్ని పాటించాల్సిందే : ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:24 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ విధిగా సామాజిక దూరాన్ని పాటించాలని, ముఖ్యంగా వివిధ ధాతలు ప్రజలకు అందించే సహాయ సహకారాలను సామాజిక దూరాన్ని పాటించి అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారు.

కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ ప్రాంతాల్లో వల్నరబుల్ గ్రూపులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు.

అలాగే వివిధ నిత్యావసర వస్తువులు కూరగాయలు కోనుగోలు చేసేందుకు ప్రజలు అధికంగా గుమికూడ కుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాల్లో గ్రీన్ జోన్లు,కంటోన్మెంట్ ప్రాంతాలు మొదలైన చోట్ల ధాతలు పంపిణీ చేసే వివిధ వస్తువులను సామాజిక దూరం పాటిస్తూ పంపిణీ చేసేలా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు.

అదేవిధంగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని  ధాతలు పంపిణీ చేసే సహాయం ను సామాజిక దూరాన్ని పాటించి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ముఖ్యంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులు మొబైల్ వాహనాలు ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలని సిఎస్ నీలం సాహ్ని స్పష్టం చేశారు.

నాల్గవ విడత ఇంటింటా సర్వే నిర్వహణకు ప్రణాళికను సిద్ధం చేస్తున్న ట్టు చెప్పారు.ఆసర్వేలో ప్రధానంగా 60యేళ్ళు వయస్సు దాటిన వారు, కోమార్బీడిటీ లక్షణాలు ఉన్న వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారి వివరాలను సేకరించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి మురికి వాడకు, జనసమర్ధత అధికంగా ఉన్నచోట్ల ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. 

వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ కొవిడ్ ఆసుపత్రులుగా మార్చిన చోట్ల ఆయా ఆసుపత్రులకు సంబంధించిన రెగ్యులర్  వైద్య సేవలను సమీపంలోని ఆసుపత్రుల ద్వారా అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలందరికీ ఆయా వివరాలు తెలిసేలా మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు.

అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఉండి వచ్చేవారికి వెంటనే వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అలాంటి వారిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించి ఆప్రకారం వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.ఈ రెండు అంశాలకు సంబంధించి సర్కులర్లను పంపడం జరుగుతుందని చెప్పారు.

కొవిద్ ఆసుపత్రుల్లో ఎన్-95 మాస్క్ లు,పిపిఇలు సరిపడినన్ని అందుబాటులో ఉంచాలని అన్నారు. వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కె.భాస్కర్, పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం, వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డా.అరుణకుమారి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments