Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుపేదల పేరిట అర్చన.. లడ్డూ అంటే కలాంకు ఇష్టం: డాలర్ శేషాద్రి

Webdunia
బుధవారం, 29 జులై 2015 (19:15 IST)
దివంగత శాస్త్రవేత్త, డాక్టర్ అబ్దుల్ కలాం గురించి ఓఎస్డీ డాలర్ శేషాద్రి తన అనుభవాన్ని పంచుకున్నారు. కలాం తిరుమల వచ్చినప్పుడల్లా తనను తమిళంలోనే ఆప్యాయంగా పలకరించేవారని.. ఆర్భాటాలకు పోకుండా సామాన్య భక్తుడిలా ఆలయానికి వచ్చేవారని చెప్పారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కలాంకు అత్యంత ప్రీతిపాత్రమంటూ... ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ వకుళమాత దర్శనం చేసుకుని, హుండీలో కానుకలు సమర్పించేవారన్నారు.
 
రాష్ట్రపతి హోదాలో కలాం  2003లో శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చారని.. శ్రీవారి దర్శనానంతరం కలాం నిరుపేదల పేరిట అర్చన చేయించాలని కోరి రూ.400 టీటీడీకి చెల్లించి సాధారణ పౌరుడిలా రశీదు తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత అర్చనా సేవా టికెట్లను రాష్ట్రపతి భవన్‌కు పంపించామన్నారు.

రాష్ట్రపతి హోదాలో కలాం తిరుపతికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు కానీ, టీటీడీ ఆయనకు కేటాయించిన తేదీల్లోనే శ్రీవారి దర్శనానికి రావడం ఆయన భక్తిప్రపత్తులకు నిదర్శనమని కొనియాడారు. 2009లో మాజీ రాష్ట్రపతిగా మరోసారి తిరుమల వచ్చి నిరుపేదల కోసం ఆయన అర్చన చేయించారని శేషాద్రి గుర్తుచేసుకున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments