తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఉన్నఫళంగా కూటమి ప్రభుత్వం కూల్చివేసిందంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్ ఈ నిర్మాణం అక్రమంగా చేస్తున్నారనీ, సంజాయిషీ ఇవ్వాలంటూ గత మే నెల నుంచి నోటీసుల రూపంలో ఇస్తూనే వుంది. ఐతే వాటిని పట్టించుకోని వైసిపి సర్కార్ కార్యాలయం నిర్మాణం చేపట్టింది. తమ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా నిర్మాణం చేస్తుండటంతో భవనాలను నిర్మిస్తున్న స్థలం నీటిపారుదల శాఖకు చెందినదని పేర్కొంటూ సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేసారు.
తాడేపల్లిలోని సర్వే నంబర్ 202/ఏ1లోని ఆ భూమిని జగన్ మోహన్ రెడ్డి తన అధికార దుర్వినియోగం చేసి వైసీపీకి కట్టబెట్టారని టీడీపీ అంటోంది. ఆ రెండెకరాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించి పక్కనే ఉన్న 15 ఎకరాలను ఆక్రమించుకోవాలని జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రెండు ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు నీటిపారుదల శాఖ జగన్‌కు అనుమతి ఇవ్వలేదని సమాచారం.