పాఠశాలల్లో సౌకర్యాల కల్పనలో రాజీపడొద్దు: జగన్

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (06:02 IST)
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్ఠికాహార లోపాన్ని పూర్తిగా నివారించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.

మధ్యాహ్న భోజనంలో పిల్లలకు మరో ప్రత్యేక వంటకం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీనిపై ప్రతిపాదనలు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచటంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం సహా పౌష్ఠికాహారంపై సమీక్ష నిర్వహించారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు సురేష్, తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో మరో 65 సెంట్రలైజ్డ్‌ కిచెన్స్‌ ఏర్పాటుపైనా సీఎం చర్చించారు. గర్భిణీలు, పిల్లల తల్లులకు, చిన్నారులకు పౌష్ఠికాహారంపై వివరాలు తెలుసుకున్నారు.

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్ఠికాహారం తప్పక అందించాలని సీఎం ఆదేశించారు. వీటిలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో విస్తృతంగా చర్చించిన సీఎం... వీరికి నగదు బదిలీ చేసే అంశంపైనా సమాలోచనలు చేశారు.

తల్లులు, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించాలన్న ఆయన.. వీటన్నింటిపైనా ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments