Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజుపై అన‌ర్హ‌త‌ వేటు వేయండి

Webdunia
గురువారం, 8 జులై 2021 (14:28 IST)
ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు పై అన‌ర్హ‌త‌ వేటు వేయాల‌ని లోక్ స‌భ స్పీక‌ర్ ను వైసీపీ ఎంపీలు డిమాండు చేశారు. ఆర్.ఆర్.ఆర్. పై వేసిన అన‌ర్ష‌త నోటీస్‌ను వెంట‌నే అమ‌లు చేయాల‌ని లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను గురువారం ఢిల్లీలో క‌లిసి విజ్ణ్న‌ప్తి చేశారు.

వైసీపీ ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, మిధున్ రెడ్డి, మార్గాని భ‌ర‌త్ లు లోక్ స‌భ స్పీక‌ర్ తో స‌మావేశం అయ్యారు. ర‌ఘురామ కృష్ణంరాజు పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని వివ‌రించారు. దానికి సంబంధించిన ఆధారాల‌ను ఓం బిర్లాకు స‌మర్పించారు. ఇక ఆయ‌న్ని ఉపేక్షించ‌వ‌ద్ద‌ని, వెంట‌నే ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు లోక్ స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరారు.

అయితే, దీనికి రెండు రోజుల ముందే ఎంపీ ర‌ఘ‌రామ కృష్ణం రాజు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసిన సంగ‌తి విదిత‌మే. ఆయ‌నపై వైసీపీ ఇచ్చిన అన‌ర్హ‌త నోటీస్ చెల్ల‌ద‌ని, తాను పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను పార్టీలో, ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న కొన్ని ప‌రిణామాల‌ను ప్ర‌శ్నించినందుకే, త‌న‌పై పార్టీ వ‌ర్గాలే దాడి చేస్తున్నాయ‌ని ఆయ‌న స్పీక‌ర్ కు తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం. అయితే, ఇపుడు ముగ్గురు ఎంపీలు స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసి, ర‌ఘు రామ‌కృష్ణంరాజుపై వేటు వేయాల‌ని కోర‌డంతో దీనిపై స్పీక‌ర్ ఏలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments