Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ కేసులోని నిందితులు చనిపోయారు.. సో.. కేసు క్లోజ్

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (12:18 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో నలుగురు నిందితులు చనిపోయారనీ, అందువల్ల దిశ కేసును క్లోజు చేయాలని కోర్టును షాద్ నగర్ పోలీసులు కోరనున్నారు. ఇందుకోసం షాద్‌నగర్‌ కోర్టులో రిపోర్టు దాఖలు చేసి కేసు క్లోజ్‌ చేసేందుకు అనుమతి కోరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 
 
ఈ కేసులో నలుగురు నిందితులు మృతి చెందడంతో తదుపరి దర్యాప్తు చేసే వీలులేనందున కేసు క్లోజ్‌ చేసేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు తెలిసింది. తదుపరి దర్యాప్తునకు ఆస్కారం లేని పలు కేసుల్ని గతంలో పోలీసులు కోర్టు అనుమతితో క్లోజ్‌ చేశారు. దీంతో ప్రస్తుత కేసులోనూ అదే తరహాలో ముందుకెళ్లనున్నట్లు సమాచారం. 
 
అదేసమయంలో షాద్‌నగర్‌ పీఎస్‌లో దిశ మిస్సింగ్‌, కిడ్నాప్‌, హత్యాచారానికి సంబంధించి నమోదైన కేసు క్లోజ్‌ అయినా... నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన విచారణ వాస్తవాలు నిగ్గుతేలే వరకు కొనసాగనుంది. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్‌ ఈ వారంలో హైదరాబాద్‌కు వచ్చి విచారణ ప్రారంభించనుంది. 
 
కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నలుగురు నిందితులు పోలీస్‌ కాల్పుల్లో చనిపోయిన విషయం తెల్సిందే. దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలతో కోర్టులో రిపోర్టు దాఖలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments