Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు పోతున్నది టాలివుడ్‌కా తెలంగాణ రాష్ట్రానికా.. మళ్లీ ఫైర్ అయిన వర్మ

హైదరాబాద్‌ నగరంలో మాదకద్రవ్యాల కేసు విచారణలో పరువు పోతోంది తెలుగు చిత్ర పరిశ్రమకా లేక తెలంగాణ రాష్ట్రానికా..అంటూ ప్రముఖ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్లీ మండిపడ్డాడు. డ్రగ్స్ కేసు విచారణ అంటూ టాలీవుడ్ లోని కొంతమంది నటీనటులను, సాంకేతిక నిపుణులను విచ

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (09:07 IST)
హైదరాబాద్‌ నగరంలో మాదకద్రవ్యాల కేసు విచారణలో పరువు పోతోంది తెలుగు చిత్ర పరిశ్రమకా లేక తెలంగాణ రాష్ట్రానికా..అంటూ ప్రముఖ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్లీ మండిపడ్డాడు. డ్రగ్స్ కేసు విచారణ అంటూ టాలీవుడ్ లోని కొంతమంది నటీనటులను, సాంకేతిక నిపుణులను విచారిస్తున్న తీరుతో మొత్తం తెలంగాణ ప్రతిష్టకే భంగం కలిగిందని వర్మ తన ఫేస్ బుక్‌లో తీవ్రంగా వ్యాఖ్యానించాడు. డ్రగ్స్ కేసుల కారణంగా పంజాబ్ కన్నా దారుణ స్థితిలో తెలంగాణా ఉందని ముంబైవాసులు అంటున్నారని వర్మ తెలిపాడు. 
 
విచారణ అంటూ మీడియాకు లేనిపోని లీకులు ఇస్తున్నారని మండిపడ్డాడు.ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రతిష్ట దెబ్బ తిన్నదని అభిప్రాయపడిన ఈయన..ఈ విచారణ వల్ల ఒరిగేదేమీ లేదని కూడా అన్నాడు.  ఇటీవలే  రాంగోపాల్ వర్మ ఈ కేసులకు సంబంధించి తీవ్రంగా ఎగిరి పడిన సంగతి తెలిసిందే. 
 
ముంబై ప్రజలు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం గురించి, టీఆరెస్, కేసీఆర్ గురించి చాలా మంచిగా చెప్పుకుంటూ వచ్చారని కానీ సిట్ పుణ్యమా అని వారు ఇప్పుడు డ్రగ్స్ గురించి ప్రశ్నలు వేసుకుంటున్నారని వర్మ ఎద్దేవా చేశాడు. అందుకే హైదరాబాద్, టీఆర్ఎస్, కేసీఆర్ ప్రతిష్టను పునరుద్ధరించాలని వర్మ చెప్పాడు. 
 
ముంబై ప్రజలు తెరాస ప్రభుత్వం చాలా సమర్థమైన ప్రభుత్వమని భావిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు భారత దేశంలోని ఏ రాష్ట్రంలోనే కాదు. హైదరాబాద్‌లోని స్కూళ్లలో కూడా డ్రగ్స్ ఉంటున్నాయని ముంబై ప్రజలు భావిస్తున్నారు. ముందుగా సిట్ దీన్ని సరిదిద్దితే మంచిది .. అంటూ వర్మ ఎద్దేవా చేశాడు
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments