Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బెవరికి చేదు..? ఆయన లొంగుతారేమో చూద్దాం... సెబాస్టియన్, సండ్రల మధ్య ఆసక్తికర సంభాషణ

Webdunia
బుధవారం, 8 జులై 2015 (06:54 IST)
టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ముఖ్యమైన ఆధారాలను సేకరించారు. డబ్బు చుట్టూ తిరిగిన ఆ సంభాషణలో అన్ని ఎన్నికలలో డబ్బు ప్రభావం, ఎమ్మెల్యేను ప్రలోభపెట్టడం వంటి అనే కోణాలు వెలుగు చూశాయి. రిమాండ్‌ రిపోర్ట్‌లో ఏసీబీ అధికారులు అనేక అంశాలను ప్రస్తావించారు. రేవంత్‌ రెడ్డి, సెబాస్టియన్‌లతో ఆయన జరిపిన సంభాషణల వివరాలు తెలిపారు. రిమాండ్‌ రిపోర్టు ప్రకారం...మే 27 నుంచి 31వ తేదీ మధ్య సండ్ర, సెబాస్టియన్‌ మధ్య జరిగిన సంభాషణల్లోని ముఖ్యాంశాలు...
 
మే 27 రాత్రి 9:45 గంటలు...సండ్రకు సెబాస్టియన్‌ ఫోన్‌ చేశారు.
సెబాస్టియన్‌: ఇప్పుడు మనకు ఆయన గురించి ఏం ఇన్ఫర్మేషన్‌ కావాలి?
ఎమ్మెల్యే: ఎన్నికలున్నాయి. ఆయనకు ఓటు హక్కు ఉంది. ఆయనేమన్నా... అమౌంట్‌కు లొంగుతాడేమో, మన పార్టీకి సహకరించమని అడగాలి. ఎందుకంటే...ఆయనకు ఫర్‌దర్‌ రాజకీయాలతో అవసరం లేదుకదా! ఒకసారి నామినేటెడ్‌ అయిపోయిద్ది గదా... డబ్బు ముఖ్యం కదా.. ఆయనకు!
సెబాస్టియన్‌:అదైతే కరెక్ట్‌
ఎమ్మెల్యే:  ఆ...సోర్స్‌ మనకి కావాలి! ఒకటో తారీఖు నాడు పోలింగ్‌ ఉంది. ఈ లోపుల ట్యాప్‌ చేసి... ఆయనతో మీటింగ్‌ ఏర్పాటు చేస్తే...
సెబాస్టియన్‌:ఓకే సార్‌. మనం.. ఆయనకు హోటల్లో టైం ఇద్దామా? మాట్లాడటానికి లేదా...
ఎమ్మెల్యే:  మీరు ఆయనకు దగ్గరా? డీల్‌ చేసి సక్సెస్‌ కావాలి. ఫెయిల్‌ కావొద్దు.
సెబాస్టియన్‌: ఆ రెస్పాన్స్‌బిలిటీ తీసుకుంటారా సర్‌!
ఎమ్మెల్యే: ఆయన ఓటుకు రెస్పాన్స్‌ ఇస్తే... అమౌంట్‌కు రెస్పాన్స్‌బిలిటీ నాది.
సెబాస్టియన్‌: ఆబ్సెంట్‌ అయినా..ఫర్వాలేదా..
ఎమ్మెల్యే: ఆబ్సెంట్‌ అంటేకంటే కూడా, ఓటు అడగాలి. లేకపోతేనే ఆబ్సెంట్‌కు అడుగుదాం.
సెబాస్టియన్‌: రేపు ఎన్టీఆర్‌ ఘాట్‌కు వస్తున్నాం, ప్రేయర్‌ చేయడానికి. సర్‌ రమ్మన్నారు.
ఎమ్మెల్యే: సర్‌ ఎన్నింటికి వస్తున్నారు ఘాట్‌కి?
ఏ-2: ఏమో! నన్ను 7 గంటలకు రమ్మన్నారు.
ఎమ్మెల్యే: ఓకే.. మీరు మీ పని చూసుకోండి. 
ఏ-2: ఓకే సర్‌.. మంచిది.. టచ్‌లో ఉంటా మీకు. 
(మే 28 సాయంత్రం 6:10 గంటలకు సండ్రకు సెబాస్టియన్‌ కాల్‌ చేశారు.)
సెబాస్టియన్‌: నమస్కారం సర్‌.
ఎమ్మెల్యే: నమస్కారం. మీ మెసేజ్‌ చూశాను.
సెబాస్టియన్‌: మీరు చెప్పిన పని గురించి నేను అక్కడకి పోయి మాట్లాడాను. మనకు... చెప్పకుండా ఆల్రెడి ఎవరో ఉదయం మాట్లాడారట. ‘నువ్వు నాకు బిషప్‌. నమ్మకముంది’ అని నాతో అన్నారు. నాకు చెడ్డపేరు వస్తదేమో అని ఒక మాట అన్నారు. కానీ, నేను ఆయనను మేనేజ్‌ చేశాను. బీజేపీలో అట్కిన్‌సన్‌ అనే ఒక రాజ్యసభ మెంబర్‌... నామినెటేడ్‌ సభ్యుడిని నేనే ప్రమోట్‌ చేశానని తెలిపాను. ఏపీలో ఏం కావాలన్నా ప్రతి మంత్రీ చేసిపెడతాడన్నాను. వచ్చే ఎన్నికల్లో వందశాతం ఇక్కడ టీడీపీనే వస్తుందని, మళ్లీ నీ పేరే ప్రపోజ్‌ చేస్తామని తెలిపాను. ఆయన చాలా సంతోషించారు. ఉదయం వచ్చిన వారు వేరే విధంగా మాట్లాడారని చెప్పారు. ఈ రోజు ఫ్యామిలీ, వెల్‌విషర్స్‌తో మాట్లాడి రేపు ఉదయనికి చెబుతానన్నారు. డైరెక్ట్‌గా బాబు దగ్గరకి తీసుకెళ్లే సత్తా నాకుందని, ఏం కావాలో చెప్పాలని అన్నాను.
ఎమ్మెల్యే: రేపటికైనా ఒక లైన్‌అప్‌ చేస్తే మనం సిట్టింగ్‌ పెట్టుకుందాం. 
(మే 30 ఉదయం 10:35 గంటలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నుంచి సెబాస్టియన్‌కు కాల్‌ వెళ్లింది. )
ఎమ్మెల్యే: హలో...
సెబాస్టియన్‌: ఎమ్మెల్యేగారూ నమస్కారం సర్‌. రేవంత్‌రెడ్డిగారికి ఫోన్‌ చేశాను సర్‌. బాబుగారి ఇంటిదగ్గరున్నాడంట. అది మీరొకసారి మాట్లాడి.. మనం, ఎందుకంటే... మనం 11 గంటలకు టైం ఇచ్చినాం
ఎమ్మెల్యే: ఒక్క నిమిషం... నా ఎదురుగానే ఉన్నాడు (రేవంత్‌?). సర్‌ దగ్గర 10 నిమిషాల్లో మాట్లాడేసి బయల్దేరుతాం. మనం వెళ్లాల్సింది ఎటువైపు?
సెబాస్టియన్‌: బోయిగూడ.
ఎమ్మెల్యే: అయితే మీరు పార్టీ ఆఫీసు దగ్గరకు రండి. అయితే నాకు ఈజీ అయిద్ది. ఇది చూసుకుని నేను ఆడకి వచ్చేస్తా.
సెబాస్టియన్‌: మంచిది సర్‌. పార్టీ ఆఫీసు కాడకి వచ్చేస్తా.
ఎమ్మెల్యే: ఒక్క నిమిషం! (ఆ..అన్నగారూ... సీక్రెట్‌ డ్యూటీలో పోయేటప్పుడు అడ్రస్‌ వెతుక్కోకూడదు. డైరెక్ట్‌గా పోయేటట్టు ఉండాలంటే. మీరు ఆఫీసుకాడకు రండి. మనోడు వచ్చేస్తాడు.)
సెబాస్టియన్‌: మీరక్కడున్నారా?
ఎమ్మెల్యే: లేదు. సారింటికాడున్నా! నువ్వు... ఇద్దరం, ఎందుకు డబుల్‌ పనొద్దులే. 
సెబాస్టియన్‌: మీ ఇష్టం. మీరంటే మీరు!
ఎమ్మెల్యే: మా కొద్దులే... మాకేం ఇబ్బంది లేదు. ఎవరు చేసినా పార్టీ పని, మన దోస్తోడు. మీరు చేసినా, అన్నచేసినా,     నేను చేసినా.. ఒక్కటే కామన్‌ మన అజెండా!

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments