Webdunia - Bharat's app for daily news and videos

Install App

విసుగు చెందిన దంపతులు.. హైకోర్టు ఎదుట‌ ఆత్మహత్యాయత్నం

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (16:51 IST)
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లకు చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ధూళిపాళ్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు చీలికోటి దేవేంద్ర రావు, చీలికోటి భానుశ్రీల ఇంటి స్థలానికి సంబంధించిన వివాదంలో కొందరు వ్యక్తులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని హైకోర్టు వద్ద ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే గమనించిన ఎస్పీఎఫ్ సిబ్బంది దంపతుల చేతిలో ఉన్న డీజిల్ సీసాను లాక్కున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తుళ్లూరు స్టేషన్‌కు తరలించారు.
 
2003 నుంచి తమకు ఉన్న స్థలంలో నివాసం ఉంటున్నామని.. 2017లో బస్ షెల్టర్ నిర్మాణానికి బలవంతంగా తీసుకొనేందుకు యత్నించగా తాము హైకోర్టును ఆశ్రయించామని బాధితుడు దేవేంద్ర తెలిపారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. గ్రామంలో కొంత మంది పెద్దలు తమను నిత్యం వేధిస్తున్నారని వాపోయారు. దీంతో విసుగు చెంది హైకోర్టు వద్దే ఆత్మహత్య చేసుకుందామని ఇక్కడికి వచ్చినట్లు దేవేంద్రరావు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments