శ్రీ‌వారి భ‌క్తులు రీఫండ్‌ పొందేందుకు డిసెంబరు 31 వరకు అవకాశం

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (07:28 IST)
లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి 13 నుండి జూన్ 30వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్(tirupatibalaji.ap.gov.in) ద్వారాగానీ, పోస్టాఫీసు, ఇ-ద‌ర్శ‌న్ మరియు ఎపి ఆన్ లైన్ కౌంట‌ర్ల ద్వారా గానీ శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, వ‌స‌తి గదులను బుక్ చేసుకున్న భ‌క్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్ పొందేందుకు డిసెంబరు 31వ తేదీ వరకు టిటిడి మరో అవకాశం కల్పించింది.
           
ఈ మేర‌కు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు వాటిని ఆన్‌లైన్‌లోనే రద్దు చేసుకునే అవకాశం కల్పించారు. పోస్టాఫీసు, ఈ-దర్శన్ కౌంటర్లు మరియు ఎపి ఆన్ లైన్ కౌంట‌ర్ల ద్వారా బుక్ చేసుకున్న భ‌క్తులు సంబంధిత టికెట్ వివ‌రాల‌తోపాటు, బ్యాంకు ఖాతా నంబ‌రు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివ‌రాల‌ను excel టెక్ట్స్ లో‌ టైపు చేసి refunddesk_1@tirumala.org మెయిల్ ఐడికి పంపాల‌ని టిటిడి కోరుతోంది. మెయిల్ వివ‌రాల ఖ‌చ్చిత‌త్వాన్ని ప‌రిశీలించిన అనంత‌రం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భ‌క్తుల ఖాతాల్లోకి జ‌మ చేస్తారు.
 
టికెట్లు రద్దు చేసుకుని రీఫండ్ పొందడానికి ఇష్టపడని భక్తులు డిసెంబరు 31వ తేదీలోపు వారికి అనువైన తేదీల్లో ఆ టికెట్లు చూపి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ రెండు అవకాశాల్లో ఒకదాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరడమైనది.
 
2021 డైరీలు, క్యాలెండ‌ర్లు ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అవ‌కాశం
టిటిడి ముద్రించిన 2021 డైరీలు, క్యాలెండ‌ర్లను భ‌క్తులు ఆన్‌లైన్‌(tirupatibalaji.ap.gov.in) ద్వారా బుక్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించ‌డ‌మైన‌ది. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని కోర‌డమైన‌ది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

P.G. Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ లో AI సెషన్స్ వుంటాయి : పి.జి. విందా

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments