జగన్ తెలివి తక్కువ వాడు: దేవినేని ఉమ

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (05:19 IST)
నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలంలోని జుజ్జూరు గ్రామంలో అమరావతి రాజధానిగా కొనసాగించాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సందర్భంగా దీక్షా శిబిరాన్ని మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్యతో కలిసి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి వారికి తన సంఘీభావం తెలియజేశారు.
 
ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని జగన్ సంపూర్ణంగా ఆహ్వానించారని, 30 వేల ఎకరాలు కావాలి అని శాసనసభ సాక్షిగా చెప్పారని అన్నారు.  రైతులు 33 వేల ఎకరాలను రాజధానికి ఇచ్చారని, అది ప్రభుత్వానికి ఇచ్చారు కానీ ఏ ఒక్కరి వ్యక్తిగత అవసరాల కోసం కాదని అన్నారు.

రైతుల రక్షణ కోసం సిఆర్డిఏ చట్టాన్ని పకడ్బందీగా చేశామని, నేడు ప్రాంతీయతత్వం రెచ్చగొట్టే  విధంగా జగన్ మోహన్ రెడ్డి 3రాజధానుల పాట పాడుతున్నాడని అన్నారు. తన వైఫల్యాలను చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి  రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.
 
 రాజధాని తరలింపును సహించబోమని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి తమ రాజధానిని కాపాడుకుంటారని దేవినేని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లు విన్న అధికారులంతా ఇప్పుడు జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట విని సంతకాలు పెడుతున్న అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

రహస్య జీవోలపై సంతకాలు చేసిన వారిపై భవిష్యత్తులో సీబీఐ విచారణ జరుగుతుందని అన్నారు.  వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పాలనలో జగన్‌, విజయ సాయిరెడ్డిల మాటలు విని, సంతకాలు పెట్టిన అధికారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో గుర్తు చేసుకోవాలని దేవినేని ఉమ అన్నారు.

పోస్టింగ్‌ కోసం ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఇప్పటికీ ఢిల్లీలో కేంద్రమంత్రులు, పార్లమెంటు చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు. అధికారులు తొందరపడి జీవోలపై సంతకాలు పెట్టకూడదని సూచించారు.

జగన్ తెలివి తక్కువ వాడని, అటువంటి వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు. రాజధానిపై జగన్ తీరు సరికాదని అన్నారు. అమరావతి ఎపికి రాజధాని అని దేవినేని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ రాత్రికి రేటెంత? సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన రేణూ దేశాయ్

Srinath Maganti: శోభనం రోజే వాంతి చేసుకుంటే మెన్షన్ హౌస్ మల్లేష్ ఏం చేశాడు?

Heba Patel: సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రేపు ఉదయం 10 గంటలకు

Rajamouli: ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి షెడ్యూల్ అంటార్కిటికాలో - తాజా అప్ డేట్

Peddi sekaṇḍ siṅgil: పెద్ది సెకండ్ సింగిల్ రై రై రారా.. అంటూ రామ్ చరణ్ గ్రేస్ పెంచాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments