Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై అక్కసు వెళ్లగక్కిన కేఈ : ధ్యాసంతా ప.గో జిల్లాపైనేనంటూ విమర్శలు

Webdunia
శనివారం, 23 మే 2015 (14:50 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మరోమారు తన అక్కసును వెళ్ళగక్కారు. కర్నూలు జిల్లాపై చంద్రబాబు సరిగా దృష్టిసారించడం లేదనీ, ఆయన ధ్యాసంతా పశ్చిమ గోదావరి జిల్లాపైనే ఉందంటూ వ్యాఖ్యానించారు. 
 
ఆయన శుక్రవారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ బాబు చూపంతా ఎప్పుడూ పశ్చిమగోదావరి జిల్లాపైనేనని, కర్నూలుపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. అలాగని కర్నూలులో 3 సీట్లే గెలవడంలో తమ తప్పు లేదన్నారు. 
 
ఇకపోతే.. జిల్లా టీడీపీ కొత్త అధ్యక్షుడు... జిల్లాలో ఏ వీధి ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు. చాలా శ్రమ పడాల్సి ఉందని జిల్లా పార్టీ కొత్త అధ్యక్షుడికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడు మార్పు చాలా సాహసవంతమైన చర్య అన్నారు. చంద్రబాబుపై అసంతృప్తిని వెళ్లగక్కడం కేఈ కృష్ణమూర్తికి కొత్త కాదు. ఏపీ నూతన రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కేఈ మొదట్లోనే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments