Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దు.. కొండపై భక్తుల కష్టాలు.. నోట్ల మార్పిడికి తంటాలు..

పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలకు కష్టాలు తప్పట్లేదు. ఏటీఎంలు, బ్యాంకులు రద్దు కావడంతో చిల్లర వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడ

Webdunia
బుధవారం, 9 నవంబరు 2016 (10:10 IST)
పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలకు కష్టాలు తప్పట్లేదు. ఏటీఎంలు, బ్యాంకులు రద్దు కావడంతో చిల్లర వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం రాత్రి ప్రకటించడంతో చిరు వ్యాపారులలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రధానంగా తిరుమల కొండపైగల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. 
 
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకేటశ్వర స్వామి దర్శనానికి భక్తులు దూర ప్రాంతాలనుంచి పెద్దఎత్తున భక్తులు విచ్చేస్తుంటారు. అయితే... వీరిలో ఎక్కువ మంది దగ్గర పెద్ద నోట్లే ఉంటాయి. అయితే... స్వామి వారి దర్శనం అనంతరం భక్తులు కొండపైగల దుకాణాల్లో ఆయా వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఈ సందర్భంగా కొనుగోలుదారులు పెద్దనోట్లను ఇవ్వడం, షాపుల యజమానులు ఈ నోట్లను తీసుకోకపోవడంతో వ్యాపారం అంత జోరుగా సాగలేదని వాపోతున్నారు.
 
మరోవైపు నోట్ల మార్పిడికి గడువు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మరో మూడు రోజుల వరకు ఎటువంటి బ్యాంకు లావాదేవీలు జరిపే అవకాశం లేకపోవడంతో ప్రజానీకం ఒక్కసారిగా చిల్లర దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తిరుమల ఆర్టీసీ బస్టాండ్‌లో గందరగోళం నెలకొంది. రూ.500, 1000 నోట్లను ఆర్టీసీ సిబ్బంది తీసుకోకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ సినిమా తల్వార్ లో నటుడిగా పూరి జగన్నాథ్

శబ్ధం హారర్ జానర్ తర్వాత మయసభ, మరకతమణి 2 చేస్తున్నాను : హీరో ఆది పినిశెట్టి

Shiva Rajkumar: క్యాన్సర్‌ నుంచి కోలుకున్న శివన్న.. చెర్రీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటా..

తెలుగులో దినేష్ విజన్ నిర్మించిన విక్కీ కౌశల్ ఛావా విడుదల

భూమిక ముఖ్య పాత్ర‌లో గుణ శేఖర్ యుఫోరియా షూట్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments