ప్రజల్లో సహనం నశిస్తోంది... రోజులు గడుస్తున్నా సమస్యను చక్కదిద్దరేం : మోడీకి చంద్రబాబు ప్రశ్న

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కల్లోల పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రజల్లో ఓర్పు, సహనం నశిస్తోం

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (08:58 IST)
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కల్లోల పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రజల్లో ఓర్పు, సహనం నశిస్తోందంటూ వ్యాఖ్యానించారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి రోజులు గడుస్తున్నా పరిస్థితులను చక్కదిద్దరేమంటూ ప్రశ్నించారు. పైగా ఒక సమస్య ఇన్నాళ్లపాటు పరిష్కారం కాకపోవడాన్ని తొలిసారి చూస్తున్నాను. ఈ పరిస్థితితో నాకే అసహనంగా ఉంది. ప్రజల సహనాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. 
 
నోట్ల రద్దు అంశంపై ఆయన ఆదివారం కలెక్టర్లు, ఆర్బీఐ, ఎస్ఎల్‌బీసీ, ఆర్థిక శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చెలామణిలోకి తెచ్చిన రూ.2000 నోట్లను రద్దు చేసి.. తిరిగి రూ.200, రూ.100 నోట్ల కరెన్సీని ప్రవేశపెట్టాలన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నిరుపేదల నుంచి అన్నివర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చిన రెండువేల కోట్లలో వంద నోట్లు రూ.400 కోట్లు ఉన్నాయని తెలిపారు.
 
అన్ని బ్యాంకులు సమన్వయంగా పనిచేయాలని, ప్రజలు ఇబ్బందులను బ్యాంకర్లు, అధికారులు గమనించి, తక్షణం ఉపశమనం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని బ్యాంకర్లకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇవ్వాలని, సకాలంలో దిశానిర్దేశం చేసే సీనియర్‌ అధికారులను జిల్లాల్లో నియమించాలని బ్యాంకర్లకు సూచించారు. జన్‌ధన్ ఖాతాలు, రూపే కార్డులను తక్షణం క్రియాశీలం చేయాలన్నారు. సమన్వయంతో పనిచేయని బ్యాంకర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments