Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (13:24 IST)
తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలకు చేరుకుంది. పైగా గాలిలో తమ 15 శాతానికి పడిపోయింది. 
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రుతుపవనాలు తాకిన తొలి వారంలో తెలంగాణలో విస్తారంగా కురిశాయి. ఈ వర్షాలు ఆ తర్వాత కనుమరుగయ్యాయి. రాష్ట్రంపై పొడి మేఘాలు కమ్ముకోవడంతో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 
 
గాలిలో తేమ 15 శాతానికి పడిపోయింది. ఫలితంగా ఉక్కపోతలు మొదలయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. 
 
అదేసమయంలో నేటి నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశమే లేదని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ భారతదేశంలో మొదలైన రుతుపవనాలు ఉత్తర భారతదేశం వైపు వెళ్లిపోవడంతో అక్కడ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. 
 
అక్కడ తగ్గితే ఇక్కడ వర్షాలు పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల కదలికలు తెలంగాణలో బలహీనంగా ఉన్నట్టు చెప్పారు. బంగాళాఖాతంలో ఎలాంటి మార్పులు లేవని, వాతావరణం సాధారణంగా ఉందని పేర్కొన్నారు.
 
కాగా, నల్గొండ జిల్లా నిడమానూరులో ఈ నెలలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న ఇక్కడ పగటి ఉష్ణోగ్రత 38.5 డిగ్రీలుగా ఉంది. మరో నాలుగైదు రోజులపాటు ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments