Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంకల్పం మంచిది కాకపోవడమే కారణం: పురంధేశ్వరి

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (09:26 IST)
రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడి సంకల్పం మంచిది కాకపోవడమే రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులకు కారణమని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పరోక్షంగా చంద్రబాబు పేరు ప్రస్తావించకుండానే విమర్శించారు. రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పి. మాణిక్యాలరావు అధ్యక్షతన ఏర్పాటైన కరువు పరిశీలన బృందం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె కూడలికి సోమవారం సాయంత్రం చేరుకుంది. అక్కడ తొలుత జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పురందేశ్వరి ఆ తర్వాత విమర్శల దండకాన్ని మొదలెట్టారు.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరోక్షంగా చంద్రబాబును విమర్శించారు. రాజు మంచివాడైతేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. అసలు రాజు బుద్దే మంచిది కాకుంటే పరిస్థితులు ఇలానే ఉంటాయని ఎద్దేవా చేశారు. చేపట్టిన సంకల్పం మంచిదైతే అంతా మంచే జరుగుతుంది ఆమె. 
 
రాష్ట్రం నుంచి  కేంద్రానికి సరైన పద్ధతిలో వినతులు వెళితే వాటి పరిష్కారానికి కేంద్రం మొగ్గుచూపుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దుర్బుద్దే  ప్రస్తుతం దుర్భరమైన కరువు పరిస్థితులు నెలకొనడానికి కారణమంటూ పరోక్షంగా విమర్శించారు.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments