Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబ్ గుబులు - పలు రైళ్లు రద్దు - అప్రమత్తమైన అధికారులు

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (11:38 IST)
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొన్ని గంటల్లో తుఫానుగా మారబోతోంది. ఈ తుఫానుకు గులాబ్‌ అనే పేరును పాకిస్థాన్ ఖరారు చేసింది. పశ్చిమ దిశగా పయనిస్తున్న ఈ తుఫాను ఆదివారం సాయంత్రం విశాఖపట్టణం-గోపాల్‌పూర్‌ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరందాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 
 
ఈ తుఫాను ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాతోపాటు ఏపీ, తెలంగాణ, బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఏపీ, ఒడిశాలోని పలు ప్రాంతాలకు తుపాను హెచ్చరికలు జారీ చేసింది.
 
ముఖ్యంగా, తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనావేసింది. 
 
ఇప్పటికే ఏపీ, ఒడిశాలకు తుఫాన్ హెచ్చరికలను జారీ చేసింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. 
 
ఈ తుఫాను కారణంగా భారీ వర్షాలతో పాటు.. బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేశారు. అలాగే, లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments