Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అల్పపీడనంగా మారనున్న ఆవర్తన ద్రోణి

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (08:27 IST)
అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి స్థిరంగా ఉందని, ఇది గురువారం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని గోపాల్ ‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్‌ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ అల్పపీడనం ఈ నెల 22వ తేదీలోగా వాయుగుండంగాను, 23వ తేదీకి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. తూర్పు కేంద్ర బంగాళాఖాతం నుంచి ఈ విపత్తు పశ్చిమ కేంద్ర బంగాళాఖాతానికి చేరువవుతుందని, ఆ తర్వాత మళ్లీ దిశ మార్చుకుని తీరంవైపు వస్తుందని చెప్పారు. 
 
తుఫాను తీవ్రత, ఎక్కడ తీరాన్ని దాటుతుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదని, 22న పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ నేపథ్యంలో సముద్ర ఉపరితలంలో 22వ తేదీ నుంచి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందన్నారు. చేపల వేట నిషేధించినట్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments