అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

ఠాగూర్
మంగళవారం, 28 అక్టోబరు 2025 (20:36 IST)
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా రాష్ట్రాన్ని భయపెట్టిన మొంథా తుఫాను మంగళవారం రాత్రి తీరాన్ని తాకింది. కాకినాడ - మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. బంగాళాతంలో ఏర్పడిన ఈ తుఫాను ఏపీ, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలను భయపెట్టిన విషయం తెల్సిందే. 
 
ప్రచండ వేగంతో గాలులువీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోంగా మారింది. ఈ గాలులు తీవ్రత కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. తుఫాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో తీర ప్రాంతంలో 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
 
విశాఖపట్టణం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్రంలో అలలు 4 నుంచి 5 మిటర్ల మేరకు ఎగిసిపడుతున్నాయి. తీరంలోకి 1 నుంచి 2 మీటర్ల ఎత్తున సముద్రపు నీరు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీచేశారు. దీని ఆధారంగా కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments