శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

ఠాగూర్
గురువారం, 27 నవంబరు 2025 (17:27 IST)
నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకునివున్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం ఏర్పడివుంది. ఇది తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీనికి దిత్వాహ్ అనే పేరు పెట్టినట్టు యెమన్‌ దేశం వెల్లడించింది. ఈ పేరును యెమెన్ దేశం నామకరణం చేసిందని అధికారులు తెలిపారు. 
 
ఉత్తర తమిళనాడు - పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో తుఫాను కదులుతోందని పేర్కొన్నారు. దిత్వాహ్‌ తుపాను ట్రింకోమలీ(శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం ఆనుకుని తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 
 
రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈనెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశముందని రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో 20 సెం.మీకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments