Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీటెక్ స్టూడెంట్ నీచపు పని... స్నేహితురాలి ప్రైవేట్ ఫొటోలు పోర్న్‌వెబ్‌సైట్‌లో పెట్టాడు

ఓ బీటెక్ స్టూడెంట్ అత్యంత నీచపు పనికి పాల్పడ్డాడు. తన స్నేహితురాలి ప్రైవేట్ ఫోటోలను పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టి పోలీసులకు బుక్కయ్యాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... చిత్తూరు జిల్లా

Webdunia
గురువారం, 9 మార్చి 2017 (10:17 IST)
ఓ బీటెక్ స్టూడెంట్ అత్యంత నీచపు పనికి పాల్పడ్డాడు. తన స్నేహితురాలి ప్రైవేట్ ఫోటోలను పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టి పోలీసులకు బుక్కయ్యాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... చిత్తూరు జిల్లాకు చెందిన నవీన్ ప్రసాద్ అనే యువకుడు బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నవీన్ కలిసి 2013-15లో హైదరాబాదులోని నిజాంపేట క్రాస్‌రోడ్డులోని ఓ కళాశాలలో బాధిత యువతి కలిసి చదువుకుంది. ఈ క్రమంలో వీరి పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు నవీన్‌ను మందలించారు. దీంతో స్నేహితులుగా ఉందామంటూ యువతిని నమ్మించి, స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. 
 
యువతి అతడి మాటలు నమ్మింది. ఈ క్రమంలో ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పంపాలంటూ యువతిని కోరాడు. అతడిని నమ్మిన ఆమె వాట్సాప్ ద్వారా వాటిని పంపింది. వీటిని అందుకున్న నవీన్ ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అంతేకాదు వాటిని పోర్న్‌ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసి వాటి లింకులను బాధితురాలికి పంపాడు. 
 
దీంతో ఈ విషయాన్ని బంధువైన దిలీప్ కుమార్‌కు చెప్పిన యువతి తనకు సాయం చేయాలని కోరింది. వాటిని చూసిన దిలీప్ కూడా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో యువతి ఇద్దరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు శనివారం దిలీప్‌ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైన నవీన్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం