Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చెయ్యి తియ్‌... నిన్ను కూడా సెంట్రల్‌ జైలుకు పంపే కార్యక్రమం కూడా చేస్తా' : ఆస్పత్రిలో జగన్‌ హల్‌చల్‌

వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి నందిగామ ప్రభుత్వాసుపత్రిలో హల్‌చల్ సృష్టించారు. మంగళవారం జరిగిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద దుర్ఘటనలో గాయపడిన ప్రయాణికులను ఆయన పరామర్శించారు.

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (12:32 IST)
వైకాపా అధినేత, విపక్ష నేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి నందిగామ ప్రభుత్వాసుపత్రిలో హల్‌చల్ సృష్టించారు. మంగళవారం జరిగిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద దుర్ఘటనలో గాయపడిన ప్రయాణికులను ఆయన పరామర్శించారు. 
 
అలాగే, ఈ ప్రమాదంలో మరణించిన వారికి శవపరీక్షలు చేశారు. ఆ పోస్టుమార్టం నివేదికను ఆయన వైద్యులను అడిగి తీసుకున్నారు. ఆ సమయంలో ఆస్పత్రిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైద్యులు ఇచ్చిన పోస్ట్‌మార్టమ్‌ నివేదికను జగన్ జేబులో పెట్టుకోబోతుండగా వైద్యులు ‘‘సార్‌.. సార్‌... అవి ఒరిజినల్‌ రిపోర్టులు. మీకు ఫొటోస్టాట్‌ ఇస్తాం’’ అని ఆపబోయారు. 
 
దీనికి జగన్.. ‘‘మూడు కాపీలు ఉన్నప్పుడు ఒక కాపీ ఇవ్వడానికి ఏంటి?’’ అంటూ వాగ్వాదానికి దిగారు. నివేదికను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా ‘‘చెయ్యి తియ్‌.... చెయ్యి తియ్‌....’’ అంటూ వాటిని ఆయన లాక్కున్నారు. ‘‘ఇది డాక్టర్‌ కాపీ సార్‌....’’ అని చెప్పగా.. ‘‘నేను ప్రతిపక్ష నాయకుడ్ని. నాకే నివేదిక ఇవ్వరా?’’ అని మండిపడ్డారు. 
 
ఆ దశలో జిల్లా కలెక్టర్‌ బాబు జోక్యం చేసుకుని జగన్ నుంచి పోస్టుమార్టం నివేదికను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయగా, ‘‘పోలీసుల నుంచి కలెక్టర్‌ దాకా అధికారులందరూ అవినీతిపరులు’’ అని తీవ్రస్వరంతో అన్నారు. నిన్ను కూడా సెంట్రల్‌ జైలుకు తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తాం. గుర్తుపెట్టుకోండి అంటూ కలెక్టర్‌ ఒంటిపై చేయి వేసి హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో జగన్‌పై నందిగామలో క్రిమినల్ కేసు నమోదైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments