Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. రాజధాని రైతులకు కౌలు చెల్లింపు..

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (14:22 IST)
న్యాయ పోరాటం తర్వాత అమరావతి రాజధాని రైతులకు కౌలు చెల్లింపులు జరిగాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్షిక కౌలును సీఆర్డీఏ ఎట్టకేలకు మంజూరు చేసింది. 
 
భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులు, వ్యక్తులకు వారి ఖాతాల్లో రెండు విడతల్లో ఆ నిధులను జమ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కౌలు చెల్లింపు కోసం రూ.208 కోట్లకు బడ్జెట్‌ను విడుదల చేసింది. 
 
దీని నుంచి సుమారు 23వేల మందికి పైగా రైతులకు రూ.184 కోట్లను వారి వారి ఖాతాల్లో జమచేశారు. ఈ నెల 27న రూ.112 కోట్లు, మంగళవారం  మిగిలిన రూ.72 కోట్లను వేశారు. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం రూ.195 కోట్లకు బడ్జెట్‌ విడుదల చేయగా... రూ.188 కోట్లను కౌలు కింద చెల్లించారు. 
 
ప్రతి ఏటా మే నెల మొదటి వారంలో ఇవ్వాల్సిన కౌలును మూడేళ్ల నుంచి ఆలస్యం చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము భూములిచ్చి సీఆర్‌డీఏ కార్యాలయం, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు.

ఈ ఏడాది కూడా హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం విచారణకు రానుండడంతోనే కౌలు మొత్తాన్ని అధికారులు చెల్లించారని రైతులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments