హైకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంది? రామకృష్ణ

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (14:53 IST)
జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును సిపిఐ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది పూర్తిగా అధికార పార్టీకి అనుకూలం అని వ్యాఖ్యానిస్తోంది. అధికార వైసీపీకి అనుకూలంగా ఉంద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ నుండి పోలింగ్ వరకు ఏకపక్షంగా సాగాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
 
అధికార వైయస్సార్ కాంగ్రెస్ దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాలతో ఎన్నికల ప్రక్రియ గడిచింద‌ని, ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కూడా ఏకపక్షమే అని విమర్శించారు. పోలింగ్ కు ముందు కనీసం 4 వారాలు ఎన్నికల కోడ్ అమలులో ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతరు చేయలేద‌ని, ఈ ఎన్నికలను రద్దు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింద‌ని చెప్పారు. హైకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంద‌ని రామకృష్ణ ప్ర‌శ్నించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments