Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురూ మూడు కోతులు.. జగన్‌కు ఓవరాక్షన్ చేయడం తప్ప మరేమీ తెలియదు!

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ఓవారక్షన్ చేయడం మినహా మరేమీ తెలియదని తేల్చిపారేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుత

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (16:20 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ఓవారక్షన్ చేయడం మినహా మరేమీ తెలియదని తేల్చిపారేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తే అధోగ‌తి పాల‌వుతారు త‌ప్పా మ‌రేమీ మిగ‌ల‌బోద‌ని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్ర‌బాబు, కేసీఆర్‌, జ‌గ‌న్‌ మూడు కోతుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వారు ముగ్గురూ ఒక దేవుడిలా చూస్తున్నార‌ని, ఢిల్లీకి వెళ్లి మోడీ ముందు భ‌క్తి, గౌర‌వాల‌తో మాట్లాడుతున్నార‌ంటూ పేర్కొన్నారు. 
 
మ‌హాత్మ గాంధీ మూడు కోతుల గురించి చెప్పార‌ని, అందులో ఒక కోతి విన‌దు, మ‌రొక‌టి మాట్లాడ‌దు, ఇంకోటి చూడ‌దు అని అన్నారు. ప్రధాని మోడీ వద్ద ఈ ముగ్గురూ ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ ఛాంబ‌ర్‌లోకి నీళ్లు వ‌చ్చాయంటూ టీడీపీ, వైసీపీ నేత‌లు ఒకరిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నార‌ని, రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై మాట్లాడకుండా, భ‌వ‌నంలోకి నీళ్లొచ్చాయి, ఛాంబ‌ర్‌లోకి నీళ్లొచ్చాయి అంటూ వాదించుకోవ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ ఓవ‌రాక్ష‌న్ ఆపేయాల‌ని ఆయ‌న సూచించారు. లక్ష్మీపార్వ‌తి, శ‌శిక‌ళ ఓవ‌ర్ యాక్ష‌న్‌తోనే న‌ష్ట‌పోయార‌ని, జ‌గ‌న్ కూడా అలాగే న‌ష్ట‌పోతార‌ని నారాయణ హితవు పలికారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments