Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసుల మాఫీ కోసమే అమరావతి రచ్చ .. కంత్రీ జగన్ వ్యూహమిదే : సీపీఐ నారాయణ

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (13:58 IST)
తనపై ఉన్న అన్ని కేసులను మాఫీ చేయించుకునేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్పు అంశాన్ని తెరపైకి తెచ్చారని సీపీఐ నేత కె. నారాయణ ఆరోపించారు. రాజధాని అమరావతి కోసం టీడీపీ నేత గద్దె రామ్మోహన్ సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షను చేపట్టారు. 
 
ఈ దీక్షకు నారాయణ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని మార్చే అర్హత సీఎం జగన్‌కు లేదన్నారు. ఒకవేళ రాజధానిని మార్చాలంటే జగన్ మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. 
 
వైసీపీ నేతలకు కావాల్సింది రాజధాని కాదని, విశాఖ సెజ్‌లో వచ్చే లక్షల కోట్లని ఆరోపించారు. అలాగే, విశాఖతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వైకాపా నేతలకు ఉన్న భూములను కోట్లాది రూపాయలకు అమ్ముకోవడమేనని చెప్పారు. 
 
ఇకపోతే, రాజధానిపై జగన్‌కు మూడు ముక్కలాట ఆలోచన ఎందుకు వచ్చిందని నారాయణ ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడేందుకే వైసీపీ నేతలు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాజధాని మార్పు వల్ల ఎన్నో నష్టాలు వస్తాయని ఆయన తెలిపారు.
 
రాజధాని మార్పుపై బీజేపీతో సీఎం జగన్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని మార్చబోనని జగన్ హామీ ఇవ్వొచ్చు అని నారాయణ జోస్యం చెప్పారు. అందుకే జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments