Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌తో చేతులు కలుపుదాం.. 11 రాష్ట్రాలకు హోదాలేదంటున్న పురంధేశ్వరి

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చేతులు కలుపుతామని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదన్నారు. ఈ అంశానికి సంబం

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (09:21 IST)
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చేతులు కలుపుతామని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదన్నారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సమరశంఖం పూరించిన పవన్‌తో ఇప్పటికే చర్చలు జరిపామన్నారు. రానున్న రోజుల్లో పవన్‌తో కలిసి ఉద్యమిస్తామన్నారు.
 
రాష్ట్రంలో అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి పవన్‌తో చేతులు  కలపాల్సిందేనని కె. రామకృష్ణ వెల్లడించారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చిన రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడుదారులకు అండగా నిలుస్తున్నాయని ఆరోపించారు.
 
ఇదిలా ఉంటే.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు వచ్చే మార్చి తరువాత ప్రత్యేకహోదా అనుభవిస్తున్న 11 రాష్ట్రాల్లోనూ హోదాను నిలిపివేస్తున్నట్లు బీజేపీ అఖిలభారత మహిళామోర్చా ఇనచార్జి దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆమె మాట్లాడుతూ.. హోదా కంటే ప్యాకేజీతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని.. వచ్చే డబ్బుతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుందని పురంధేశ్వరి వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

OTT: ఓటీటీ వచ్చాక థియేటర్లు చనిపోయాయి : నిర్మాత గణపతి రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments