Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కొనసాగుతున్న వైరస్ వ్యాప్తి .. మరో 33 కొత్త కేసులు

Andhra Pradesh
Webdunia
శుక్రవారం, 29 మే 2020 (17:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఫలితంగా శుక్రవారం కూడా మరో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,638 నమూనాలు పరీక్షించగా, అందులో 33 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు తేలింది. ఈ కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,874కి చేరింది. 
 
కాగా, రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వాటిలో 6 కేసులకు కోయంబేడు లింకు ఉన్నట్టు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 2 కేసులు వెలుగుచూశాయి. శుక్రవారం 79 మంది డిశ్చార్జి కావడంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,037కి పెరిగింది. 
 
మరోవైపు, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 777 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, గడచిన 24 గంటల్లో కర్నూలులో ఒక కరోనా మరణం సంభవించింది. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 60 మంది కరోనాతో మృత్యువాత పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వైద్య బులిటెన్‌లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments