Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైడ్ ఎఫెక్ట్స్ లేని పులివెందుల వైద్యుడి పసరు మందు... ఆనందయ్యకు ధీటుగా...

Webdunia
గురువారం, 27 మే 2021 (12:13 IST)
కడప జిల్లా పులివెందులలో ఓ నాటు వైద్యుడు కరోనా రోగులకు ఇస్తున్న పసరు మందు బాగా పని చేస్తుంది. ముఖ్యంగా, కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇచ్చే మందుకు ధీటుగా ఇది పని చేస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో ఈ పసరు మందుకోసం చుట్టుపక్కల ప్రాంతాల వారంతూ క్యూ కడుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నంలో ఆనంద‌య్య త‌యారు చేసిన క‌రోనా ఆయుర్వేద ప‌స‌రు మందు పెద్ద చ‌ర్చ‌గా మారింది.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు అన్న‌ట్టుగా మారిపోయింది. ఆయ‌న వేలాది మందికి మందు పంపిణీ చేయారు.. ఎలాంటి హానిక‌ర ప‌దార్థాలు లేవ‌ని ఇప్ప‌టికే తేల్చేరు. 
 
అయితే, దీనిపై మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేస్తున్నారు.. ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌భుత్వ అనుమ‌తి కోసం వేచిచూస్తున్నారు. ఇదిలావుంటే, ఏపీలో కొన్ని చోట్ల ప‌స‌రు వైద్యులు తెర‌పైకి వ‌చ్చారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోనూ ఓ వ్య‌క్తి ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున క్యూ క‌ట్టారు. అలాగే, చిత్తూరు జిల్లాలో కూడా ఓ ఇటుకల వ్యాపారి కూడా పసరు మందును పంపిణీ చేస్తున్నారు. దీంతో ఆయనపై పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. 
 
ఇదిలావుంటే, తాజాగా క‌డ‌ప జిల్లా పులివెందులలో మరో ఆయుర్వేద వైద్యుడు తెర‌పైకి వ‌చ్చారు.. క‌రోనా ఫ‌స్ట్‌వేవ్ స‌మ‌యంలో సుమారు 3 లక్షల మందికి పసరు మందు అందించిన‌ట్టు చెబుతున్నారు. ఈ వైద్యుడు పేరు వివేక్ యాదవ్.. పసరు మందు తీసుకున్న వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాలేద‌న్నారు. 
 
ఇక‌, పసరు మందు తీసుకున్న వారు అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారని.. ప్ర‌స్తుతం కోవిడ్ సీరియస్ కేసులు కూడా పసరు మందు తిన్నాక కుడుద‌ప‌ట్టార‌ని వెల్ల‌డించారు. గత 30 ఏళ్ల నుండి వివిధ రోగాల‌కు ఆయుర్వేద మందులు తయారు చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఇప్ప‌టికీ ఆనంద‌య్య మందుపై ఎటూ తేల‌లేదు.. మ‌రి వివేక్ యాద‌వ్ విష‌యంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments