Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు పోలీసుల ఔదార్యం

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (11:42 IST)
సంజీవకుమార్ అనే వ్యక్తి  ఎ పి 28 BL 1969 అను కారులో ప్రొద్దుటూరు నుండి హైదరబాద్ కు కర్నూలు మీదుగా వెళుతున్నాడు. కర్నూలు, ఓర్వకల్లు సమీపంలోని హుస్సేనాపురం దగ్గర  సంజీవకుమార్ కారులో ప్రయాణిస్తూ SR పెట్రోల్ బంకు దగ్గర నిద్ర మత్తులో కల్వర్టు క్రింద పడి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 
 
ఈయనకు తలకు, ఎడమకాలుకు గాయం అయినది. ఈ రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని నంద్యాల నుండి కర్నూలుకు వెళ్తున్న విద్యార్ది  నాడ వినయ్ డయల్ 100 పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న  హైవే పెట్రోలింగ్ ఒర్వకల్లు  పోలీసులు హెడ్ కానిస్టేబుల్ 2586 ఆంజనేయులు, హోంగార్డు 726 కె. నాగరాజు రోడ్డు ప్రమాద సంఘటన స్ధలానికి చేరుకుని క్షతగాత్రులకు సహాయపడి వెంటనే హైవే అంబులెన్సు ద్వారా వైద్యం కోసం  కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేందుకు సహాయపడ్డారు. 
 
సత్వరమే స్పందించి రోడ్డు ప్రమాదంలో గాయపడిన  క్షతగాత్రులకు సహాయపడి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోలీసులను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ప్రభాస్.... ఎలా?

కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 555 Cr+ వసూళ్లు

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments