Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందిగామలో టీడీపీ అభ్యర్థి సౌమ్య గెలుపు.. మెదక్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం..

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (11:10 IST)
నందిగామ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఆమె 73,807 ఓట్ల భారీ మెజార్టీని సాధించారు. చివరి రౌండ్లలో కాస్త పుంజుకోవడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావు కష్టపడి డిపాజిట్ దక్కించుకోగలిగారు. ఈ ఎన్నికల్లో వైకాపా పోటీ చేయని విషయం తెల్సిందే. 
 
ఇకపోతే.. మెదక్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ మెజార్టీ రౌండు రౌండుకు పెరుగుతూనే ఉంది. ఐదో రౌండు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి లక్షా పదివేల ఆధిక్యాన్ని సాధించారు. రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి మూడో రౌండ్ పూర్తయ్యేసరికి 65,597 ఓట్ల ఆధిక్యతను సాధించారు. లెక్కింపులో ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌కు 1,00,288 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థికి 34,691 ఓట్లు... బీజేపీ అభ్యర్థి 24,547 ఓట్లు సాధించారు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments