Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లీకేజీ హల్‌చల్... గాంధీ ఆస్పత్రిలో పెట్రోల్ బాటిల్‌తో వైద్యుడి హల్‌చల్...

Coronavirus Leak
Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (13:14 IST)
హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఓ వైద్యుడు పెట్రోల్ బాటిల్‌తో హల్‌చల్ చేశాడు. కరోనా వైరస్ ఉందంటూ అసత్య ప్రచారం చేశారనీ పేర్కొంటూ వైద్యుడుపై ఆస్పత్రి ఉన్నత వర్గాలు చర్యలు తీసుకున్నాయి. దీంతో ఆ వైద్యుడు హల్‌చల్ సృష్టించాడు. చొక్కా కింద పొట్ట భాగంలో రెండు పెట్రోల్ బాటిల్స్, చేతిలో లైటర్ పెట్టుకుని కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూ హైడ్రామా సృష్టించాడు. 
 
చైనా దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలో వెలుగు చూసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారం లీకేజీ వ్యవహారంపై డాక్టర్ వసంత్‌తో పాటు.. ముగ్గురు సిబ్బందిపై ఆస్పత్రి సస్పెండ్ చేసింది. దీన్ని జీర్ణించుకోలేక పోయారు. ముఖ్యంగా, అకారణంగా తనపై చర్యలు తీసుకున్నారంటూ ఆయన ఆరోపిస్తూ అత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 
 
నిజానికి కరోనా వైరస్ రోజురోజుకూ దేశాలను దాటేస్తూ వ్యాప్తి చెందుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. అయితే.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేరినవారికి కరోనా వైరస్ ఉందని పలువురు డాక్టర్లు హడావుడి చేశారు. దీంతో కొందరు వైద్యులపై ఉన్నాతాధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. 
 
ఈ వ్యవహారంపై డాక్టర్ వసంత్ మీడియాతో మాట్లాడుతూ, గాంధీ ఆస్పత్రిలో నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. గాంధీలో నుంచి పంపించేందుకు కుట్రపన్నారు. కరోనా పాజిటివ్ లీకేజీల పేరుతో నన్ను బదిలిచేశారు. వ్యతిరేకంగా మాట్లాడితే మాపై చర్యలు తీసుకుంటున్నారు. డాక్టర్‌ తిట్టాడంటూ పది మందితో సంతకాలు చేయించి చర్యలు తీసుకున్నారు. ప్రాణాలు పోసే డాక్టర్‌కే అన్యాయం జరుగుతోంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. సూపరింటెండెంట్‌ సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో నాని "హిట్" చిత్రానికి శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు!!

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments