Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా 182 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (17:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 135 కేసులు నమోదవగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి 38 మందికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 
 
అలాగే విదేశాల నుంచి వచ్చి 9 మందికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ఏపీలో 182 పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి. 
 
ఏపీకి చెందిన 11,602 శాంపిళ్లను పరిశీలించగా 135 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా 65 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. 
 
ఏపీలో నమోదైన మొత్తం 4,261 పాజిటివ్ కేసులకు గాను 2,540 మంది డిశ్చార్జ్ అవగా.. 80 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1,641 మంది కరోనా కారణంగా చికిత్స పొందుతున్నారు. 
 
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. తెలంగాణలో ప్రతిరోజు నమోదవుతున్న కేసుల్లో మూడింట రెండు వంతుల కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో కూడా పోలీసులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో పలువురు మహమ్మారి బారిన పడుతున్నారు.
 
తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో, పోలీస్ శాఖ షాక్‌కు గురైంది. 
 
అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం వారి ప్రైమరీ కాంటాక్ట్ వివరాలను సేకరించి... అందరినీ క్వారంటైన్‌కు తరలించారు. వారందరి శాంపిళ్లను సేకరించి, కరోనా టెస్టులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments