Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎఎస్ అధికారుల విరాళం రూ.20 లక్షలు

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (17:19 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో అఖిల భారత సర్వీసు అధికారులు తమదైన శైలిలో స్పందించారు. కరోనా కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ పరంగా చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు చేయూతను అందించేందుకు ముందుకు వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 162 మంది అధికారులు తమ మూడు రోజుల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించాలని నిర్ణయించినట్లు ఐఎఎస్ అదికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, పర్యాటక సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

మూడు రోజుల జీతంగా రూ.20 లక్షలు తాము ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించనున్నామని, ఈ క్రమంలో తమ జీతాల నుండి ఆ మొత్తాలను మినహాయించాలని ఆర్ధిక శాఖ కార్యదర్శికి లేఖ రాసామని పేర్కొన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు  తమ వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నామని ప్రవీణ్ కుమార్ వివరించారు.

రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారులు కరోనా వ్యాప్తి నిరోధం నేపధ్యంలో విభిన్న బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని, విపత్కర పరిస్ధితిలో పాలనా యంత్రాంగాన్ని సిఎం అదేశాల మేరకు ముందుకు నడిపించటంలో తమదైన పాత్రను పోషిస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఎటువంటి బాధ్యతలనైనా నిర్వర్తించేందుకు అఖిల భారత సర్వీసు అధికారులు సిద్ధంగా ఉన్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments