Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా - ఆటోనగర్‌లో కలకలం : టీ వ్యాపారికి కరోనా పాజిటివ్ ...

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (21:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ హల్చల్ సృష్టిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అటు ప్రభుత్వ అధికారులు, ఇటు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పైగా, ప్రతి రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. బుధవారం కూడా 70కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కర్నూలు, కృష్ణ, గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. 
 
ఇంతలోనే కృష్ణా జిల్లాలో ఓ కలకలం చెలరేగింది. జిల్లాలోని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో ఓ టీ వ్యాపారికి కరోనా వైరస్ సోకినట్టు వార్త స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ టీ వ్యాపారి స్థానికంగానే కాకుండా, కార్మిక్ నగర్, ఆటో నగర్‌లలో కూడా టీ విక్రయిస్తూ పోషణ సాగిస్తున్నాడు. దీంతో ఆ రెండు ప్రాంతాల వాసులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
 
టీ దుకారణ యజమానికి కరోనా నిర్ధారణ కావడంతో ఆయన కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా, ఈ టీ దుకాణంలో టీ సేవించిన వారిని గుర్తిస్తున్నారు. వీరందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, వైరస్ నిర్ధారణ అయినవారిని ఆస్పత్రికి మిగిలిన వారిని హోం క్వారంటైన్‌కు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments