Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులెన్ని: విస్తృతంగా కరోనా టీకాల తరలింపు!!

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (18:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. అలాగే, మరణాల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో కొత్తగా 203 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
బుధవారం నమోదైన కేసులతో కలిపి ఏపీలో 8,85,437కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనా ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,134 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 2,382 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,75,921 మంది రికవరీ అయ్యారు. 
 
మరోవైపు, పూణె నుంచి రాష్ట్రానికి వచ్చిన కరోనా టీకాలను అన్ని జిల్లా కేంద్రాలకు సురక్షితంగా తరలిస్తున్నారు. అలాగే, వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా కేంద్రం తొలివిడతలో ఏపీకి రాష్ట్రానికి రాష్ట్రానికి 4,96,680 డోసులు అందించింది. 
 
వీటిలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్‌’ 4,76,680 డోసులు కాగా.. భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన ‘కొవాగ్జిన్‌’ 20వేల టీకాలున్నాయి. ఈ వ్యాక్సిన్లు మంగళవారం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి.
 
అదేవిధంగా తెలంగాణాలో కరోనా వ్యాక్సిన్‌ను జిల్లాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏ జిల్లాలకు ఎన్ని డోస్‌ల వ్యాక్సిన్‌ను పంపిస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోల్డ్ స్టోరేజ్ సెంటర్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. పుణె నుంచి నిన్ననే కోవిడ్ వ్యాక్సిన్ హైదరాబాద్‌కు చేరుకుంది. 
 
 
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే టీకాలు రాష్ట్రానికి వచ్చేశాయి. తొలి విడతగా తెలంగాణకు కేంద్రం 3.64 లక్షల డోసులను పంపింది. మంగళవారం ఉదయం పుణే నుంచి ప్రత్యేక  కార్గో విమానంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను పంపగా.. అవి  మధ్యాహ్నం 12.05 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి పోలీసు భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో కోఠిలోని వ్యాధి నిరోధక టీకా సముదాయానికి 12.55 గంటలకు చేరుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments