Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపిలో 1005 మందికి కరోనా

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (19:36 IST)
రాష్ట్రంలో వరుసగా మూడు రోజుల నుండి కరోనా కేసులు 1000కి చేరువలో ఉంటున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1005మందికి పాజిటివ్‌గా నిర్ధారణయింది. 31,142 మందికి పరీక్షలు నిర్వహించగా 1000కి పైగా పాజిటివ్‌గా తేలాయి.

చిత్తూరు, కృష్ణాజిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున ఇద్దరు మరణించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,98,815కు చేరాయి. మృతుల సంఖ్య 7,205కు చేరాయి. ఇక గడిచిన 24గంటల్లో 324 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,394 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇక గుంటూరు జిల్లాలో అత్యధికంగా 225 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 13 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.
 
మరో కేంద్ర మంత్రికి కరోనా
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి రతన్‌ లాల్‌ కఠారియా ఆదివారం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

తాను చేయించుకున్న పరీక్షల్లో కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, గుర్‌గ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు హర్యానాలోని అంబలా ఎంపి తెలిపారు. తనను ఇటీవల కలిసిన వారంతా ముందు జాగ్రత చర్యగా పరీక్షలు చేయించుకుని.. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments