Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలపై కరోనా కోరలు.. ఏపీలో 329, తెలంగాణలో 404 కేసులు

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (12:32 IST)
భారత్‌లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. దేశంలో 211 రాష్ట్రాలు వైరస్ బారినపడి అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై కూడా కరోనా కోరలు చాస్తోంది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329 కాగా, తెలంగాణలో 404కు చేరింది. 
 
నెల్లూరులో 6, కృష్ణా 6, చిత్తూరు జిల్లాల్లో 3 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా కర్నూలులో 74 కేసులు నమోదయినట్టు తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందగా ఆరుగురు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. 
 
 ఏపీలోని మొత్తం కేసుల్లో సగానికి పైగా కర్నూలు.. నెల్లూరు, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో టెన్షన్ నెలకొంది. ఏపీ సర్కార్‌ కరోనా పరీక్షా కేంద్రాల సామర్ధ్యం పెంచింది. ప్రాథమిక స్థాయిలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అధికారులు రెడ్‌జోన్లను క్లస్టర్లుగా విభజించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
ఇటు తెలంగాణలోనూ గత 24 గంటలలో మరో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 404కి చేరింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 154 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 11 మంది మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments