Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్వినిని పెళ్లిచేసుకోవాలంటే.. శిరీషను ఎస్సైకి ఫేవర్‌ చేయాలి పర్లేదా?: శ్రవణ్.. ఓకే చెప్పిన రాజీవ్

బ్యూటీషియన్ శిరీషను నమ్మినోళ్లే నట్టేట ముంచారు. రాజీవ్‌ను దూరం చేసుకోకూడదనుకున్న శిరీష, శ్రవణ్, నందును సంప్రదించింది. రాజీవ్‌ నుంచి దూరం కాకూడదని తేజస్వినిని పక్కనబెట్టాలనుకుంది. పెళ్లైనప్పటికీ రాజీవ్‌తో స్నేహాన్ని కొనసాగించుకోవాలనుకుంది.

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (09:25 IST)
బ్యూటీషియన్ శిరీషను నమ్మినోళ్లే నట్టేట ముంచారు. రాజీవ్‌ను దూరం చేసుకోకూడదనుకున్న శిరీష, శ్రవణ్, నందును సంప్రదించింది. రాజీవ్‌ నుంచి దూరం కాకూడదని తేజస్వినిని పక్కనబెట్టాలనుకుంది. పెళ్లైనప్పటికీ రాజీవ్‌తో స్నేహాన్ని కొనసాగించుకోవాలనుకుంది. అయితే రాజీవ్ మాత్రం తేజస్విని పెళ్లి చేసుకునేందుకు శిరీషను వదులుకోవాలనుకున్నాడు. చివరికి ఎస్సైకి ఫేవర్ చేయాలనుకున్నాడు. ఇలా శిరీషను నమ్మినవాళ్లే వంచించారనేందుకు బలమైన సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం. 
 
అలాగే ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే శిరీషపై ఎస్సై ప్రభాకర్ రెడ్డి అత్యాచారాం చేశాడా? లేదా? అనేది తేలిపోతుంది. ఈ నేపథ్యంలో రిమాండ్‌లో ఉన్న శ్రవణ్, రాజీవ్‌లను ఐదురోజుల కస్టడీకి పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. శిరీషకు సహకరిస్తానని నమ్మించిన రాజీవ్ ఆమెతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడు. తేజస్వినితో ప్రేమలో పడ్డాక, ఆమెను పెళ్లి చేసుకునేందుకు శిరీషను వదిలించుకోవాలని చూశాడు.
 
స్నేహం పేరుతో పరిచయం పెంచుకున్న శ్రవణ్ ఆమెను ఎరగా వేసి వాడుకోవాలనుకున్నాడు. సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ఎస్సై అత్యాచారయత్నం చేశాడు. ఇలా శిరీష నమ్మినవారంతా ఆమెను వంచించారు. దీనిపై ఆధారాలను పోలీసులు సేకరించారు.
 
ఇప్పటికే శ్రవణ్, ఎస్సై ప్రభాకర్ రెడ్డితో మాట్లాడిన కాల్స్ సంఖ్యను గుర్తించారు. ఎస్సైతో అన్నా శిరీషకు ఫేవర్ చేస్తే మనకు భవిష్యత్తులో పనికొస్తుందని ఎస్సైతో శ్రవణ్ మాట్లాడాడు. అలాగే రాజీవ్‌తో శ్రవణ్ శిరీషను వదిలించుకోవడానికి సిద్ధమేనా అని అడిగాడు. ఎస్సైకి కొంత శిరీష ఫేవర్ చేయాలని చెప్పినట్లు సమాచారం. తేజస్వినిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో రాజీవ్, శిరీషను వదిలించుకునేందుకు సిద్ధపడినట్లు, ఎస్సైకి సహకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments