Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2022 నాటికి పూర్తి

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (20:00 IST)
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ  పనులు  సంతృప్తికరంగా సాగుతున్నాయని డ్యాం డిజైన్  ప్యానల్ చైర్మన్  ఏ బి.  పాండ్యా  తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 16వ  పోలవరం  ప్రాజెక్టు  డ్యాం డిజైన్  ప్యానల్ సమీక్ష  సమావేశాన్ని నిర్వహించారు.
 
సమావేశానికి పోలవరం  ప్రాజెక్టు  డ్యాం డిజైన్  ప్యానల్  చైర్మన్ ఏ.బి.  పాండ్యా అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా ఏ.బి. పాండ్యా మాట్లాడుతూ  పోలవరం ప్రాజెక్టు 48 గేట్లుకు గానూ  29 గేట్లు  అమరిక పూర్తయిందని, మిగిలిన గేట్లు అమరికపై  అధికారులకు  పలు సూచనలు చేశారు.

ఈ గేట్లు ప్రపంచంలోనే   అతి పెద్దవిగా  పేర్కొన్నారు.  పోలవరంలో  52 మీటర్ల ఎత్తున స్పిల్వే పిల్లర్ల నిర్మాణం  పూర్తి అయ్యింది.
 
స్పిల్ వే బ్రిడ్జి 1128 మీటర్లుకుగానూ  1105  పూర్తి చేయడం జరిగింది. 48 గేట్లకు గానూ 29 గేట్లు  బిగింపు పూర్తయింది. గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లు,పవర్ ప్యాక్ లు అమార్చే పనులు వేగవంతం సాగుతున్నాయని  తెలిపారు.
 
గెడ్డర్లు అమరిక నేటితో పూర్తయిందని   వివరించారు. అయిదు అంశాలపై సమావేశంలో  చర్చించారు.  వరదలు సమయంలో కోతకు గురైన ఎడమ గట్టు పరిరక్షణ చర్చకు వచ్చింది. 

సమావేశంలో  పోలవరం ప్రాజెక్టు అధారిటీ సిఇఓ  చంద్రశేఖర్ అయ్యార్,  జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజనీర్ ఇన్ ఛీఫ్  సి. నారాయణ రెడ్డి ,పోలవరం ప్రాజెక్ట్ ఎస్ ఈ నరసింహ మూర్తి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ సి హెచ్ సుబ్బయ్య,జి ఎం సతీష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ టీజ‌ర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ స‌న్నాహాలు

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments