Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్ భార్యపై అత్యాచారయత్నం.. కోరిక తీర్చమని ఫ్లాట్‌లోకి చొరబడ్డాడు..

ఆ ఇద్దరు కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్నారు. ఒకే క్వార్టర్స్‌లోనే వుంటున్నారు. కానీ ఇద్దరిలో ఒక కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ భార్యపై కన్నేశాడు. అంతే.. భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో సహోద్యోగి అయిన కానిస

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (13:04 IST)
ఆ ఇద్దరు కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్నారు. ఒకే క్వార్టర్స్‌లోనే వుంటున్నారు. కానీ ఇద్దరిలో ఒక కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ భార్యపై కన్నేశాడు. అంతే.. భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో సహోద్యోగి అయిన కానిస్టేబుల్ భార్యపై అత్యాచారానికి ప్రయత్నించి జైలు పాలయ్యాడు. రక్షించాల్సిన పోలీసే కీచకుడిగా మారిన ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కృష్ణా జిల్లా ఆర్మడ్ రిజర్వు విభాగంలో బాలాజీ నాయక్, ఎల్లయ్య కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. బాలాజీ నాయక్ స్క్వాడ్ టీంలో పనిచేస్తుండగా ఎల్లయ్య పోలీస్ క్యాంటీన్ విధులు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ క్వార్టర్స్‌లో ఎదురెదురు ఫ్లాట్‌లలో నివాసం వుంటున్నారు. 
 
బాలాజీ నాయక్ డ్యూటీలో వెళ్లడంతో అతని భార్య ఇంట్లో ఒంటరిగా వుంటోంది. ఈ విషయాన్ని గమనించిన ఎల్లయ్య ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు. అలాంటి సమయంలో డ్యూటీ నుంచి వచ్చిన బాలాజీ నాయక్ తన భార్యపై చేస్తున్న అకృత్యాన్ని అడ్డుకోబోయాడు. ఈ ఘటనపై బాలాజీ నాయక్ సతీమణి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎల్లయ్యను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా కోర్టు రిమాండ్ విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments