Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్కాజ్‌గిరిలో గెలుస్తానని అస్సలు ఊహించలేదు : రేవంత్ రెడ్డి

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (10:21 IST)
మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి తాను గెలుస్తానని అస్సలు ఊహించలేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే, నిజామాబాద్‌లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కె.కవిత ఓడిపోతుందని కూడా ఊహించలేదన్నారు. 
 
న్యూజెర్సీలో సోమవారం ఎన్నారైలు నిర్వహించిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన బాగుంటే నిజామాబాద్‌లో ఆయన కుమార్తె కవిత ఎందుకు ఓడిపోతారని ప్రశ్నించిన రేవంత్‌ రెడ్డి.. మల్కాజిగిరిలో తానెందుకు గెలుస్తానని అన్నారు. 
 
సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రకృతే ఆ పనులు చేసి పెడుతుందన్నారు. కొడంగల్‌లో తాను ఓడిపోతానని కానీ, మల్కాజిగిరిలో గెలుస్తానని కానీ తాను ఊహించలేదన్నారు. 
 
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని కేసీఆర్ అంటున్నారని, మరి 50 శాతం ప్రైవేటీకరిస్తామని చెప్పారా? అని నిలదీశారు. ఉద్యమ సమయంలో కొడుకు, అల్లుడు వచ్చి పప్పన్నం తిని వెళ్లిపోయారని, బెంజ్ ‌కారులో వచ్చిన కూతురు కవిత బతుకమ్మ ఆడి వెళ్లిపోయిందన్నారు. 
 
అంతమాత్రానికే తాము ఉద్యమంలో పాల్గొన్నామని చెబుతున్నారని, అలా అయితే, ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు తీసుకున్న వారి సంగతేంటని? వారినేమనాలని.. వారి రుణం ఎలా తీర్చుకోవాలని ప్రశ్నించారు.
 
తెలంగాణలో ప్రస్తుతం ప్రజలు ఊహించినట్టుగా పాలన లేదని, ఇది సివిల్ వార్‌కు దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రేవంత్ అన్నారు. గతంలో నక్సలైట్లు అభివృద్ధికి అడ్డుగా ఉన్నారని అనేవారని, ఇప్పుడు వారుంటేనే బాగుంటుందనే పరిస్థితి వచ్చిందని రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments