Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు మంత్రే కావచ్చు..! మాకు చెప్పకపోతే ఎలా...? నారాయణను నిలదీసిన రాజమండ్రి మేయర్

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (15:06 IST)
సార్... నారాయణగారూ.. మీరు మంత్రే కావచ్చు.. ఇది మా ఊరు సార్.. మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మీ ఇష్టమొచ్చినట్లు చేసుకుపోతుంటే. రేప్పొద్దున్నే ఇక్కడ మేమెలా తలెత్తుకు తిరగాలండీ... మీరు చేస్తున్నది ఏమి బాగో లేదండీ అంటూ రాజమండ్రి మేయర్ రాంబాబు మంత్రి నారాయణకు ముఖంపై కొట్టినట్లు చెప్పారు. దీంతో నొచ్చుకున్న మంత్రి అక్కడ నుంచి సర్దుకుని వెళ్ళిపోయారు. వివరాలిలా ఉన్నాయి. 
 
ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, రాజమండ్రి నగరపాలక సంస్థ మేయర్ వాసిరెడ్డి రాంబాబు... ఇద్దరూ టీడీపీ నేతలే. సోమవారం ఉదయం రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో వీరద్దరూ కలుసుకున్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి సమీక్ష జరుగుతోంది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి కార్పొరేటర్లలో ఏ ఒక్కరికీ సమాచారం ఇవ్వకుండానే నారాయణ పనులు చేసుకునిపోతున్నారని ఆరోపించారు. 
 
దీనిపై కార్పొరేటర్ల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ మంత్రిని రాంబాబు నిలదీశారు. దీనిని పెద్దగా పట్టించుకోని మంత్రి తరువాత మాట్లాడుకుందాంలే అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారట 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments